లాక్ డౌన్ హీరో సోను సూద్ ఆస్తులు ఎంతున్నట్లు?

లాక్ డౌన్ హీరో సోను సూద్ ఆస్తులు ఎంతున్నట్లు?
లాక్ డౌన్ హీరో సోను సూద్ ఆస్తులు ఎంతున్నట్లు?

అప్పటిదాకా విలన్ గా సినిమాల్లో అలరిస్తూ వచ్చిన సోను సూద్ లాక్ డౌన్ సమయంలో హీరోగా మారిపోయాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో సోను సూద్ కు ఉన్న ఫాలోయింగ్ మరెవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఇన్నేళ్ల సోను సూద్ కెరీర్ లో ఎప్పుడూ లేనిది తొలిసారి తన పుట్టినరోజుకు ట్రెండ్ కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

లాక్ డౌన్ లో ఎవరైనా కష్టం అన్న మాట అంటే చాలు సోను సూద్ సహాయం వారికి చేరిపోయింది. ఇంకా దాన్ని కొనసాగిస్తున్నాడు కూడా. ట్రాక్టర్ లేక వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారికీ ట్రాక్టర్ ను బహుమతిగా ఇచ్చాడు. అలాగే ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి, తన ఉద్యోగం పోగుట్టుకుని కూరగాయలు అమ్ముకుంటోందంటే ఆమెకు సాఫ్ట్ వేర్ ఉద్యోగం కల్పించాడు. ఇక వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చడంలో సోను సూద్ చూపించిన చొరవ మరువలేనిది. ఈ దేశంలోనే కాక విదేశాల్లో చిక్కుకున్న వారిని సైతం స్పెషల్ ఫ్లయిట్స్ ద్వారా ఇండియాకు రప్పించాడు. ఇలా చేతికి ఎముక లేని చందంగా సోను సూద్ సహాయం కొనసాగుతోంది.

ఇవన్నీ చూస్తుంటే అందరికీ కామన్ గా కలిగే సందేహం అసలు ఇన్ని సహాయాలు చేయడానికి సోను సూద్ ఆస్తి ఎంత ఉందని? సోను గత 15 ఏళ్లుగా వివిధ ఇండస్ట్రీలలో నటుడిగా కొనసాగుతున్నాడు. అప్పట్లోనే భారీ పారితోషికం అందుకునేవాడు. ఇవి కాకుండా హోటల్ బిజినెస్ కూడా ఉంది. పైగా తరతరాలుగా వస్తున్న ఆస్తి ఉంది.

అయినా ఆస్తి ఎంత ఉందనేది ముఖ్యం కాదు. సోను సూద్ కంటే ఆస్తిపరులు ఈ దేశంలో కోకొల్లలు. కానీ వారెవరూ చేయలేనిది సోను చేసి చూపిస్తున్నాడు. అందుకే అతను రియల్ హీరో అయ్యాడు.