జూన్ 14 న సోనీ పిక్చర్స్ ఎంటర్ టైన్మెంట్ విడుదల చేస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘మెన్ ఇన్ బ్లాక్’ ఇంటర్నేషనల్..!!


 

Sony Pictures Entertainment released on June 14 by the sci-fi film "Men in Black" International

జూన్ 14 న సోనీ పిక్చర్స్ ఎంటర్ టైన్మెంట్ విడుదల చేస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘మెన్ ఇన్ బ్లాక్‘ ఇంటర్నేషనల్..!!

సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన మెన్ ఇన్ బ్లాక్ చిత్రం సిరీస్ లో ‘మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్’ చిత్రం ఈనెల 14 న రిలీజ్ కాబోతుంది.. లియాన్ నీసన్ , క్రిస్ హెమ్స్ వర్త్, టెస్సా తాంసన్, రెబెక్కా ఫెర్గుసన్, కుమిలి నంజీయని, రఫ్ స్పెల్, లెస్ ట్విన్స్ ఎమ్మా తాంసన్ లు నటించిన ఈ చిత్రానికి ద ఫేట్ అఫ్ ద ఫ్యూరియస్ చిత్ర దర్శకుడు ఎఫ్ . గ్యారీ గ్రయ్ దర్శకత్వం వహించాడు.. దాదాపు 110 మిలియన్ డాలర్లతో ఈ చిత్రం తెరకెక్కగా మెన్ ఇన్ బ్లాక్ సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది.. న్యూ యార్క్ సిటీ, మొరాక్కో, ఇటలీ మరియు లండన్ వంటి దేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ని సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఇండియా లో తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈనెల 14 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు..