
సూర్య హీరోగా నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం `సూరరై పొట్రూ` ఆస్కార్ రేసులోకి ప్రవేశించింది. ఈ చిత్రం జనరల్ కేటగిరీ కింద పలు అవార్డులకు ఎంపికైంది. ఈ చిత్రం ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్కోరు విభాగంలో పోటీపడుతోంది. `సూరరై పొట్రూ` ప్రస్తుతం అకాడమీ స్క్రీనింగ్ దశలో అందుబాటులో ఉంంది. ఈ వార్తలను అభిమానులకు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని . ఈ చిత్రానికి సహ నిర్మాత వ్యవహరించిన రాజ్‌శేఖర్ పాండియన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సూర్య నటిస్తూ గూనీత్ మోంగాతో కలిసి నిర్మించారు. ఏయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు డా. జి.ఆర్ గోపీనాథ్ జీవితకథ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని సూర్య భారీ వ్యవప్రయాసలకోర్చి నిర్మించారు. థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్డౌన్, కరోనా కారణంగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన విషయం తెలిసిందే.
`సూరరైపొట్రూ` ఆస్కార్ బరిలోకి ఎంటరైందని ప్రకటిస్తున్నందుకు ఆనందంగా వుంది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలోనూ పోటీపడుతోంది. అని సంగీత దర్శకుడు జీ.వి. ప్రకాష్ కుమార్ వెల్లడించారు.
ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి హీరోయిన్గా నటించింది.