సూర్య సినిమాకు నెవ‌ర్ బిఫోర్ ప్ర‌మోష‌న్స్‌!


Soorarai Pottru audio function at airport
సూర్య సినిమాకు నెవ‌ర్ బిఫోర్ ప్ర‌మోష‌న్స్‌!

త‌మిళ హీరో సూర్య ఏ సినిమా చేసినా అందులో ఎంతో కొంత కొత్త‌ద‌నం వుండాల‌ని  త‌పిస్తుంటారు. అలా సూర్య కొత్త‌గా ప్ర‌య‌త్నించిన చాలా చిత్రాలు విజ‌యాలు సాధించి ఆయ‌న‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే గ‌త కొంత కాలంగా ఆయ‌న ఎన్ని ప్ర‌యోగాలు చేసినా ఫ‌లించ‌డం లేదు. దారుణంగా బెడిసికొడుతున్నాయి. ఎంత కొత్త‌గా ప్ర‌య‌త్నించినా ఫ‌లితం వుండ‌టం లేదు. దీంతో సూర్య స్టార్ హీరోల రేసులో వెన‌క‌బ‌డిపోయారు.

వ‌రుస ఫ్లాపుల త‌రువాత సూర్య ఓ బ‌యోపిక్‌ని ఎన్నుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సూర్య న‌టిస్తున్న తాజా త‌మిళ చిత్రం `సూర‌రాయిపోట్రు`. సుధా కొంగ‌ర ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `గురు`, సాలా ఖ‌డూస్‌` చిత్రాల ద‌ర్శ‌కురాలు కావ‌డంతో ఈ సినిమాపై సూర్య ఫ్యాన్స్ గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్నార‌ట‌. ఏయిర్ డెక్క‌న్ ఫౌండ‌ర్ జి.ఆర్‌. గోపీనాథ్ స్పూర్తి వంత‌మైన క‌థ‌ని తీసుకుని ఈ చిత్రాన్ని కూపొందిస్తున్నారు. రిలీజ్‌కు ముందే డ‌బుల్ ప్రాఫిట్‌ని పొందిన ఈ సినిమా ప్ర‌మోషన్స్‌ని యునిక్‌గా నెవ‌ర్ బిఫోర్ అనే స్థాయ‌లో ప్లాన్ చేస్తున్నారు.

ఏప్రిల్ 9న స‌మ్మ‌ర్‌కి రెండు భాష‌ల్లోనూ సంద‌డి చేయ‌బోతున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌ని ఆడియో రిలీజ్‌తో స్టార్ట్ చేయ‌బోతున్నార‌ట‌. ఇందులో విశేషం ఏంటంటే ఈ చిత్ర ఆడియోని ఏకంగా చెన్నై ఇంట‌ర్నేష‌న‌ల్ ఏయిర్‌పోర్ట్‌లో నిర్వ‌హించాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది. ఏయిర్ డెక్క‌న్‌కి సంబంధించిన క‌థ కావ‌డంతో ఏయిర్ పోర్ట్ అథారిటీస్ వారు కూడా చిత్ర బృందం ఆలోచ‌న‌కు ఓకే చెప్పిన‌ట్టు తెలిసింది. మోహ‌న్‌బాబు, ప‌రేష్ రావ‌ల్‌, జాకీష్రాఫ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం ద్వారా అప‌ర్ణా బాల‌ముర‌ళి హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది.