రజనీకాంత్ కూతురు పై ట్రోలింగ్

Soundarya Rajinikanth
Soundarya Rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు దర్శకురాలు సౌందర్య పై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . సౌందర్య స్విమ్ సూట్ వేసుకొని ఈత కొడుతున్నందుకు కాదు ట్రోల్ చేసేది , చెన్నై లో తీవ్రమైన నీటి కరువు ఉంది ఇలాంటి పరిస్థితుల్లో గుక్కెడు మంచి నీళ్ల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు తమిళనాడు ప్రజలు కానీ సౌందర్య మాత్రం ఏకంగా స్విమ్మింగ్ పూల్ లో దిగి జలకాలు ఆడుతుంటే కడుపు మండదా ? అందుకే సౌందర్య పై ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు .

నెటిజన్ల ఆగ్రహం అర్ధం చేసుకున్న సౌందర్య తన తప్పు తెలుసుకొని తన కొడుకుతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఫోటో ని డిలీట్ చేసింది . ఆమేరకు ట్వీట్ కూడా పెట్టింది పాపం . చెన్నై లో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు రజనీకాంత్ కూతురు పై ఆగ్రహం వ్యక్తం చేశారు .