ఫొటోస్టోరీ :  కేక పెట్టిస్తున్న సౌంద‌ర్యం


ఫొటోస్టోరీ :  కేక పెట్టిస్తున్న సౌంద‌ర్యం
ఫొటోస్టోరీ :  కేక పెట్టిస్తున్న సౌంద‌ర్యం

కొంత మందికి స‌మ్మోహితుల్ని చేసే అందం..ఆశ్చ‌ర్య‌ప‌రిచే స్థాయిలో అందాల విందు చేసే సామ‌ర్థ్యం వున్నా వారికి అదృష్టం మాత్రం క‌లిసిరాదు. క‌వ్వించే అందాల‌న్నీ సొంత‌మైనా బాలీవుడ్ సోయ‌గం సౌంద‌ర్య శ‌ర్మ‌కు ల‌క్ క‌లిసి రావ‌డం లేదు. ఎక్స్‌పోజింగ్‌కి అడ్డు చెప్ప‌క‌పోవ‌డం… కాస్ట్యూమ్స్ విష‌యంలో పొదుపుని పాటించే క్వాలిటీస్ వున్నా బాలీవుడ్ అమెని క‌నిక‌రించ‌డం లేదు.

నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్ష‌ణ ఆ త‌రువాత న్యూ యార్క్ ఫిల్మ్ అకాడ‌మీలో న‌ట‌న‌లో మెల‌కువ‌లు నేర్చుకున్న సౌంద‌ర్య శ‌ర్మ ప్ర‌ముఖ బాలీవుడ్‌ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అనుప‌‌మ్‌ఖేర్ నిర్మించిన రాంచీ డైరీస్‌`తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌రువాత హాలీవుడ్ ఫిల్మ్ `వండ‌ర్ ఉమెన్‌` ఆడిష‌న్స్ కోసం వెల్లి అదృష్టం క‌లిసి రాక‌పోవ‌డంతో తృటిలో అవ‌కాశాన్ని కోల్పోయింది.

ప్ర‌స్తుతం త‌న టాలెంట్‌కు త‌గ్గ అవ‌కాశం కోసం ఎదురుచూస్తోంది. ఇందుకు సోష‌ల్ మీడియాని వేదిక‌గా చేసుకుని హాట్ ఫొటోల‌తో క‌వ్విస్తూ త‌న హొయ‌ల‌తో కేక పెట్టిస్తోంది. తాజాగా సౌంద‌ర్య శ‌ర్మ షేర్ చేసిన ఫొటోలు ఇంట‌ర్నెట్‌ని హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు చూసైనా బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ మేక‌ర్స్ అవ‌కావాలిస్తారేమో చూడాలి.