షాకింగ్‌: బాలు ఆరోగ్యం అత్యంత విష‌‌మం!


షాకింగ్‌: బాలు ఆరోగ్యం అత్యంత విష‌‌మం!
షాకింగ్‌: బాలు ఆరోగ్యం అత్యంత విష‌‌మం!

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనా ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా వుండ‌టంతో కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకున్న బాలు పాజిటివ్ అని రావ‌డంతో ఆగ‌స్టు 5 నుంచి చెన్నై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ఆరోగ్యం వున్న‌ట్టుండి క్షిణించింద‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు షాకింగ్ విష‌యాన్ని తాజాగా వెల్ల‌డించ‌డంతో ఆయ‌న కుటుంబం స‌భ్యుల‌తో పాటు అభిమానులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

త‌న‌కు కోవిడ్ సోకిన విష‌యాన్ని స్వ‌యంగా వీడియో ద్వారా వెల్ల‌డించిన బాల సుబ్ర‌హ్మణ్యం ఆ త‌రువాత తీవ్ర అనారోగ్యానికి గురికావ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. ట్రీట్‌మెంట్ ప్రారంభ‌మైన ద‌గ్గ‌రి నుంచి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి ఆసుప‌త్రి వ‌ర్గాల‌తో పాటు బాలు త‌న‌యుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ మీడియాకు వెల్ల‌డిస్తూ వ‌చ్చారు. ఓ ద‌శ‌లో బాలు కు క‌రోనా త‌గ్గింద‌ని, ఆయ‌న‌కు నెగెటివ్ వ‌చ్చింద‌ని, కోలుకుంటున్నార‌ని వెల్ల‌డించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

గ‌త 40 రోజులుగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న బాలు ఆరోగ్యం వున్న‌ట్టుంది క్షీణించింద‌ని గురువారం వైద్యులు ప్ర‌క‌టించ‌డం ఆందోళ‌న క‌రంగా మారింది. తాజా స‌మాచారం ప్ర‌కారం బాలు ప‌రిస్థితి తీవ్రంగా క్షీణించింద‌ని చెబుతున్నారు. దీంతో బాలు కోలు కోవాల‌ని ఆయ‌న అభిమానులు, సినీ ప్ర‌ముఖులు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. కోలుకున్న బాలు ఆరోగ్యం వున్న ఫ‌లంగా క్షిణించ‌డంతో కుటుంబ స‌భ్యులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.