అనుష్క కోసం ప్రభాస్ ఏం చేస్తున్నాడో తెలుసా ?


Prabhas and Anushka
Prabhas and Anushka

సాలిడ్ అందాల భామ అనుష్క కోసం ప్రభాస్ ఏం చేస్తున్నాడో తెలుసా ……. సాహో చిత్రాన్ని తనకు స్పెషల్ గా చూపించబోతున్నాడు . అనుష్క – ప్రభాస్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే . ఈ ఇద్దరి మధ్య అంతకుమించి ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి కానీ ఎప్పటికప్పుడు అబ్బే ! మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే ! అంటూ చెప్పుకొస్తున్నారు .

ఆ విషయాన్నీ పక్కన పెడితే సాహో గురించి ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో ప్రచారం చేస్తూనే ఉంది అనుష్క దాంతో ఈ భామ కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసి సాహో వేయాలని చూస్తున్నాడట ప్రభాస్ . ఆగస్టు 30 న సాహో వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల అవుతున్న విషయం తెలిసిందే .