కాజ‌ల్ కూడా పెళ్లికి రెడీ అవుతోందా?కాజ‌ల్ కూడా పెళ్లికి రెడీ అవుతోందా?
కాజ‌ల్ కూడా పెళ్లికి రెడీ అవుతోందా?

టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తోంది. ఎవ‌రిని క‌దిలించినా పెళ్లి వార్త‌లే. ఇప్ప‌టికే కొంత మంది వివాహం చేసుకోగా మ‌రి కొంత మంది పెళ్లి చేసుకోవ‌డానికి రెడీ అవుతున్నారు. యంగ్ హీరో నిఖిల్, ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఇప్ప‌టికే వివాహం చేసుకున్నారు. రానా, నితిన్ ఎంగేజ్‌మెంట్ పూర్తి చేసుకుని పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. నితిన్ ఎంగేజ్‌మెంట్ పూర్తి చేసుకుని పెళ్లికి సిద్ధ‌మ‌వుతుండ‌గా, రానా ఆగ‌స్టులో మిహీకా బ‌జాజ్‌ని వివాహం చేసుకోబోతున్నారు.

ఇప్ప‌టికే రానా పెళ్లి ఏర్పాట్లు అట్ట‌హాసంగా మొద‌ల‌య్యాయి. మిహీకా పెళ్లి కి సంబంధించిన ప్లాన్స్ అన్నీ సిద్ధం చేసి ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తోంది. ఇదిలా వుంటే స్టార్ హీరోయిన్ అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏడాది క్రితం వివాహం  చేసుకుని జీవితంలో  ‌‌స్థిరప‌‌డాల‌నుకుంటున్నాన‌ని, వివాహం గురించి త‌న పేరెంట్స్ ఒత్తిడి చేస్తున్నార‌ని కాజ‌ల్ వెల్ల‌డించింది. కానీ ఆ త‌రువాత మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న `ఆచార్య‌`, క‌మ‌ల్‌హాస‌న్ చేస్తున్న `ఇండ‌య‌న్ 2` చిత్రాన్ని అంగీక‌రించ‌డంతో కాజ‌ల్ వివాహం ఇప్ప‌ట్లో జ‌రిగే అవ‌కాశం లేద‌ని తేలిపోయింది.

ఇదిలా వుంటే తాజాగా మ‌రోసారి కాజ‌ల్ పెళ్లి గురించి వార్త‌లు షికారు చేయ‌డం మొద‌లైంది. ప్ర‌స్తుతం ముంబైలోని త‌న నివాసంలో వుంటున్న కాజ‌ల్ పెళ్లికి సిద్ధ‌మ‌వుతోంద‌ని, త‌న పేరెంట్స్ ఫైన‌ల్ చేసిన యువ‌కుడిని వివాహం చేసుకోనుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కాజ‌ల్ మాత్రం ఈ వార్త‌ల‌పై స్పందించ‌డం లేదు. దీంతో కాజ‌ల్ పెళ్లికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ని జోరుగా ప్ర‌చారం మొద‌లైంది.