భార్య పై అనుమానంతో నటుడు ఏం చేసాడో తెలుసా


spying on wife allegations actor nawazuddin summonedకట్టుకున్న భార్య నడవడిక అనుమానం గా ఉండటంతో ఓ ప్రయివేట్ డిటెక్టివ్ ని ఆశ్రయించాడు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ . విభిన్న నటుడు అని పేరు తెచ్చుకున్న ఈ నటుడు ఇప్పుడు అందరి ముందు అభాసుపాలయ్యాడు భార్య పై అనుమానంతో . అంజలి నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య . అయితే ఆమె పై అనుమానంతో డిటెక్టివ్ ని సంప్రదించి ఆమెకు ఎవరెవరు ఫోన్ లు చేస్తున్నారు ? ఎవరితో ఏం మాట్లాడుతోంది ? ఎక్కడికి వెడుతోంది తదితర విషయాలను కనుక్కోమని చెప్పాడట !

అయితే ఈ విషయం బయట పడటానికి కారణం ఏంటంటే ……… కొంతమంది తమ ఫోన్ లు ట్యాప్ అవుతున్నాయని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య విషయం పోలీసులకు తెలిసింది దాంతో అతడ్ని సంప్రదించడానికి ప్రయత్నించగా అటువైపు నుండి స్పందన రాకపోవడంతో నవాజుద్దీన్ కు సమన్లు జారీ చేసారు థానే పోలీసులు . అయితే నవాజుద్దీన్ మాత్రం ఇదంతా వట్టిదే ! నేను ఏ డిటెక్టివ్ ని ఆశ్రయించలేదు అని బుకాయిస్తున్నాడు మరి . పోలీసులు ఏం తేల్చుతారో చూడాలి .