శ్రీవిష్ణు `బ్రోచేవారెవ‌రురా` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌


Sree Vishnu’s ‘Brochevarevarura’ first look with ‘R3’ Batch Priyadarshi and Rahul Ramakrishna

వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో మెప్పిస్తూ హీరోగా త‌నకంటూ ప్ర‌త్యేక‌త‌ను క్రియేట్ చేసుకున్న శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం `బ్రోచేవారెవ‌రురా` సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కుమార్ మ‌న్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణుతో పాటు లెటెస్ట్ సెన్సేష‌న్స్ ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను క‌న‌ప‌డ‌తున్నారు. ఈ త్ర‌యం  రంగురంగుల దుస్తులు, షేడ్స్‌తో స్కూట‌ర్ రైడ్ చేసేలా ఈ పోస్ట‌ర్ ఉంది.

వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న రెండో చిత్రం `బ్రోచేవారెవ‌రురా`. `చ‌ల‌న‌మే చిత్ర‌ము.. చిత్ర‌మే చ‌ల‌న‌ము..` అనేది ట్యాగ్ లైన్‌.

శ్రీవిష్ణు స‌ర‌స‌న‌ నివేదా థామ‌స్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా స‌త్య‌దేవ్‌, నివేదా పేతురాజ్ కీల‌క పాత్ర‌ల్లో  న‌టిస్తున్నారు. యువ సంగీత ద‌ర్శ‌కుడు వివేక్ సాగ‌ర్ సంగీత సార‌థ్యం అందిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే నెల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

న‌టీన‌టులు:

శ్రీవిష్ణు, నివేదా థామ‌స్‌, స‌త్య‌దేవ్‌, నివేదా పేతురాజ్‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  వివేక్ ఆత్రేయ‌

నిర్మాత‌:  విజ‌య్ కుమార్ మ‌న్యం

బ్యాన‌ర్‌:  మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్‌

సంగీతం:  వివేక్ సాగ‌ర్‌

సినిమాటోగ్ర‌ఫీ:  సాయి శ్రీరాం

ఎడిట‌ర్‌:  ర‌వితేజ గిరిజాల‌

పి.ఆర్‌.ఒ:  వంశీ శేఖ‌ర్‌