ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `శ్రీ‌కారం`

Sreekaram ready to streeming in sun nxt
Sreekaram ready to streeming in sun nxt

ఈ మ‌ధ్య క‌రోనా వ‌ల్ల ఓటీటీల హ‌వా న‌డుస్తోంది. థియేట‌ర్ల‌లో వారం కూడా ఆడ‌ని సినిమాల‌ని ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల థియేట‌ర్ల‌లో పెద్ద సినిమాల పోటీ వ‌ల్ల కొన్ని సినిమాలు ఆడ‌టం లేదు. అలాంటి చిత్రాల‌కు ఓటీటీ బెస్ట్ ప్లాట్ ఫామ్‌గా మారుతోంది. దీంతో త‌మ చిత్రాల‌ని అత్య‌ధికంగా నిర్మాత‌లు ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా శ‌ర్వానంద్ న‌టించిన `శ్రీ‌కారం` ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. స‌మిస్టి వ్య‌వ‌సాయం ప్ర‌ధాన్య‌త‌ని వివ‌రిస్తూ కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో 14 రీల్స్ ప్ల‌స్ నిర్మించిన ఈ మూవీ ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అయితే టాక్ బాగున్నా ఆశించిన స్థాయిలో మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. పెద్ద చిత్రాల పోటీతో పాటు ఈ మూవీని `జాతిర‌త్నాలు` ఓవ‌ర్ టేక్ చేసింది.

దీంతో ఎంత హ‌డావిడీ చేసినా ఈ మూవీ థిమ‌యేట‌ర్ల‌లో నిల‌బ‌డ‌లేక‌పోయింది. దీంతో ఈ చిత్రాన్ని స‌న్ నెక్ట్స్ ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు. ఈ నెల 16న ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. `గ్యాంగ్‌లీడ‌ర్` ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రం మార్చి 19న వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌లై మంచి టాక్‌ని మాత్రం సొంతం చేసుకుంది. ఓటీటీలో అయినా స‌త్తాను చాటుతుందేమో చూడాలి.