`శ్రీ‌కారం` టైటిల్ సాంగ్ వ‌చ్చేసింది!

`శ్రీ‌కారం` టైటిల్ సాంగ్ వ‌చ్చేసింది!
`శ్రీ‌కారం` టైటిల్ సాంగ్ వ‌చ్చేసింది!

శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `శ్రీ‌కారం`. ఈ చిత్రం ద్వారా బి. కిషోర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్రియాంకా అరుల్‌మోహ‌న్ క‌థానాయ‌క‌గా న‌టిస్తోంది. వ్య‌వ‌సాయం ప్ర‌ధాన ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిస్తున్నారు. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.

మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే మిక్కీ జె మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని రెండు పాట‌లకు సంబంధించిన లిరిక‌ల్ వీడియోల‌ని విడుద‌ల చేశారు. వాటికి సూప‌ర్బ్ రెస్పాన్స్ ల‌భించింది. ఇప్ప‌టికే ఈ రెండు పాట‌లు టాప్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి. తాజాగా శుక్ర‌వారం ఈ చిత్ర టైటిల్ సాంగ్ లిరిక‌ల్ వీడియోని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ రిలీజ్ చేశారు.

`శ్రీ‌కారం కొత్త సంక‌ల్పానికి… క‌ల‌లు చిగురిస్తున్న సంతోషం ఇది. శ్రీ‌కారం కొత్త అధ్యాయానికి.. చిగురు ప‌రిమ‌ళ‌మ‌ల్లే దీవిస్తున్న‌దీ పుడ‌మీ..` అంటూ సాగే ఈ గీతం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునేలా ఆలోచింప‌జేసేలా వుంది. రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందించ‌గా, మిక్కీ జె మేయ‌ర్ సంగీతాన్ని అందించి మ‌రో స్థాయికి తీసుకెళ్లారు. పృధ్వీచంద్ర ఆల‌పించిన ఈ టైటిల్ సాంగ్ సినిమాకు మ‌రో హైలైట్‌గా నిలిచేలా వుంది. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రంలో రావు ర‌మేష్‌, ఆమ‌ని, ముర‌ళీశ‌ర్మ‌, నరేష్‌, స‌త్య‌, స‌ప్త‌గిరి ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.