శ్రీ‌ముఖి ప్రేమ‌లో పడిందోచ్‌!


శ్రీ‌ముఖి ప్రేమ‌లో పడిందోచ్‌!
శ్రీ‌ముఖి ప్రేమ‌లో పడిందోచ్‌!

బుల్లి తెర‌పై ఒక యాంక‌ర్ ఎంత ర‌చ్చ చేయాలో అంతకు మించి ర‌చ్చ చేస్తోంది శ్రీ‌ముఖి. టాక్ షోల‌ల్లో త‌న‌దైన స్టైల్లో రెచ్చిపోయి ఆక‌ట్టుకునే శ్రీ‌ముఖి సినిమాల్లోనూ త‌ళుక్కున మెరిసింది. కానీ అక్క‌డే కంటిన్యూ కాలేక‌పోయింది. బుల్లితెర‌ని న‌మ్ముకుని వ‌రుస షోల‌లో హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ హాట్ టాపిక్‌ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. అల్లు అర్జున్ న‌టించిన `జులాయి` సినిమాతో కెరీర్ ప్రారంభించినా సినిమాల్లో మాత్రం నిల‌బ‌డ‌లేక‌పోయింది.

బుల్లితెర‌పై క్రేజీ యాంక‌ర్‌గా గుర్తింపుని సొంతం చేసుకున్న శ్రీ‌ముఖి అత్య‌ధిక స్థాయిలో పారితోషికం అందుకుంటున్న ఏకైక యాంక‌ర్‌గా రికార్డుని సొంతం చేసుకుంది. `బిగ్ బాస్ సీజ‌న్ 3`తో మ‌రింత పాపుల‌ర్ అయిన ఈ అమ్మ‌డు ప్రేమ‌లోప‌డింద‌ట‌. గ‌త కొంత కాలంగా ఒక‌రితో డేటింగ్‌లో వుంద‌ని తాజాగా తెలిసింది. ఆమె మ‌న‌సు దోచుకున్న వ్య‌క్తి హైద‌రాబాదీ అని వినిపిస్తోంది. అత‌ను ప‌క్కా ప్రొఫెష‌న‌ల్ అని, అతను ఎవ‌రు? ఎక్క‌డుంటాడు? ఎలా వుంటాడ‌న్న విష‌యాల్ని స‌మ‌యం, సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు శ్రీ‌ముఖి స్వ‌యంగా వెల్ల‌డిస్తుందట‌.

`బిగ్ బాస్ సీజ‌న్ 3` త‌రువాత హాట్ హాట్ ఫొటో షూట్‌ల‌తో ఇంట‌ర్నెట్‌ని, సోష‌ల్ మీడియాని శ్రీ‌ముఖి హీటెక్కించేసింది. హాట్ హాట్ అందాల‌తో ఫొటో షూట్ లు నిర్వ‌హించి ఆ ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో ఎలా వుండే రాముల్మ ఎలా అయిపోయింద‌ని అంతా కామెంట్‌లు చేశారు. మ‌ళ్లీ సినిమాల్లోకి ఎంట‌ర‌వుతోందా? అని ఆరాలు తీశారు. అయితే తాను సినిమాల్లో న‌టించడం తేద‌ని, ఈ ఫొటో షూట్ లు అందు కోసం కాద‌ని శ్రీ‌ముఖి స్పష్టం చేసింది.