శ్రీరెడ్డి ని ఇల్లు ఖాళీ చేయమన్నాడట


Sri Reddy allegedly asked to vacate houseఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి ని ఆమె ఓనర్ తన ఇల్లు తక్షణం ఖాళీ చేయాలనీ ఆర్డర్ వేసాడట పైగా ఆయన ఓ ఐ ఏ ఎస్ అధికారి కూడా దాంతో నా బాధని ఎవరూ అర్ధం చేసుకోవడం లేదు , ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా ? అయినా ఈ ఇల్లు ఖాళీ చేసినా మళ్ళీ ఇచ్చేది ఎవరు ? అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కాదు అని ఎలా నమ్మాలి ? అంటూ బాధని వ్యక్తం చేస్తోంది శ్రీరెడ్డి .

గతకొద్ది రోజులుగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే . ఇక శ్రీరెడ్డి విషయాన్నీ పసిగట్టిన కొన్ని చానళ్ళు అదేపనిగా ఆమెతో లైవ్ కార్యక్రమాలు పెడుతూ తమ టి ఆర్ పి రేటింగ్ ని పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి . అయితే ఈ భామని సమర్ధించే వాళ్ళు కొంతమంది ఉండగా వ్యతిరేకించేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు దాంతో నేను భయపడేది లేదు ? నన్ను ఏమి చేయలేరు అంటూ మొండికేస్తోంది .