పవన్ ఫ్యాన్స్ పై అటాక్ చేసిన శ్రీ రెడ్డి


sri reddy attacks on pawan kalyan fansవివాదాస్పద నటి శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ అభిమానులపై దాడి చేసింది . ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ పై పవన్ అభిమానులపై విరుచుకుపడిన ఈ భామ తాజాగా రేణు దేశాయ్ కి మద్దతుగా వ్యాఖ్యలు చేసింది . రేణు దేశాయ్ రెండో పెళ్ళికి సిద్దమైన నేపథ్యంలో ఆమెని పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేసిన విషయం తెలిసిందే . కొంతమంది అదేపనిగా రేణు దేశాయ్ ని విమర్శిస్తున్నారు ఇక కొందరైతే దారుణంగా బూతులు తిడుతున్నారు రెండో పెళ్లి విషయం పట్ల దాంతో వాళ్ళ వ్యాఖ్యలు తట్టుకోలేక తన ట్విట్టర్ అకౌంట్ ని రద్దు చేసుకుంది రేణు దేశాయ్ .

పవన్ అభిమానుల గోల మరీ ఎక్కువ కావడంతో ఆమెకు మద్దతుగా నిలిచింది శ్రీ రెడ్డి . పూణేలో ఒంటరిగా ఉంటూ పిల్లలను చూసుకుంటున్న రేణు దేశాయ్ ని అదేపనిగా ఎందుకు విమర్శిస్తున్నారు ,ఆమె ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుందో మీకెవరికైనా తెలుసా ……. అలాంటప్పుడు ఆమెని ఎందుకు వేధిస్తున్నారు . రేణు దేశాయ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెని ఎవరైనా ఆదుకున్నారా ? మద్దతుగా నిలిచారా ? కష్టాల్లో ఆదుకోనప్పుడు విమర్శించే అధికారం మీకెక్కడిది ? పవన్ కళ్యాణ్ ని అభిమానిస్తే మంచిదే కానీ రేణు దేశాయ్ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తూ ఆమెని తీవ్ర స్థాయిలో విమర్శించే అధికారం మాత్రం మీకు లేదు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై విరుచుకుపడింది శ్రీ రెడ్డి . రేణు దేశాయ్ రెండో వివాహానికి సిద్ధం కాగా ఆమెని బూతులు తిట్టేస్తున్నారు కొంతమంది దాంతో శ్రీ రెడ్డి రంగంలోకి దిగింది . అయితే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కి శుభాకాంక్షలు తెలియజేసినప్పటికీ కొంతమంది మాత్రం రేణు ని అదేపనిగా విమర్శిస్తున్నారు దాంతో ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేసింది .

English Title: sri reddy attacks on pawan kalyan fans