శ్రీ రెడ్డి కోరిక ఎన్టీఆర్ తీరుస్తాడా ?జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పకుండా గెల్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోకి అడుగుపెడతాడని ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తెలిపారు . అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పాడు లగడపాటి . అయితే లగడపాటి రాజగోపాల్ ఇంతకుముందు చెప్పిన ఫలితాలు దాదాపుగా నిజమయ్యాయి కానీ తెలంగాణలో చెప్పిన జోస్యం మాత్రం తల్లకిందులు అయ్యింది .

దాంతో లగడపాటి రాజగోపాల్ చెబుతున్న లెక్కలు లెక్కలోకి రాకుండాపోయాయి . కానీ ఎక్కడో చిన్న ఆశ ఈ ఫలితాలు నిజం అవుతాయేమో అని ! ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కు కూడా బాగానే ఓట్లు పడ్డాయని కాకపోతే సీట్లు ఎక్కువగా గెలిచే పరిస్థితి లేదని చిరంజీవి కంటే తక్కువే పవన్ కళ్యాణ్ కు వస్తాయని ……… అలాగే పవన్ కళ్యాణ్ తప్పకుండ గెలిచి అసెంబ్లీ లో అడుగు పెడతాడని అంటున్నాడు లగడపాటి . పవన్ కళ్యాణ్ భీమవరం నుండి అలాగే గాజువాక నుండి పోటీ చేసాడు . మే 23న ఈ ఫలితాలు వెలువడనున్నాయి .