మా ని సవాల్ చేస్తున్న శ్రీ రెడ్డి


sri reddy comments once again on maa

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని మరోసారి సవాల్ చేస్తోంది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . గతకొంతకాలంగా శ్రీ రెడ్డి రేపిన వివాదం టాలీవుడ్ ని సునామీ లా చుట్టేసిన విషయం తెలిసిందే . కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ సతమతం అవగా తాజాగా అమెరికా సెక్స్ రాకెట్ టాలీవుడ్ ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది . అయితే మనవాళ్ళు కాస్టింగ్ కౌచ్ ని లైట్ గా తీసుకున్నారు కానీ అమెరికా పోలీసులు మాత్రం సెక్స్ రాకెట్ ని అంత అవలీలగా వదిలేలా లేరని హెచ్చరికలు జారీ చేస్తోంది .

ఈ సెక్స్ రాకెట్ వ్యవహారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెడకు చుట్టుకోవడం ఖాయమని ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా నేను అడిగిన సభ్యత్వాన్ని ఇవ్వండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి . మొత్తానికి శ్రీ రెడ్డి రేపిన దుమారం రెండు నెలలుగా టాలీవుడ్ ని పట్టి పీడిస్తోంది . మాలో సభ్యత్వం అప్పుడే ఇచ్చి ఉంటే ఇంత దుమారం రేగేది కాదేమో ! కానీ మా సభ్యత్వం నిరాకరించడంతో లొల్లి లొల్లి అవుతోంది .