పవన్ కళ్యాణ్ పై మళ్ళీ విరుచుకుపడిన శ్రీ రెడ్డి


sri reddy comments onceagain on pawan kalyan

పవన్ కళ్యాణ్ పై ఇప్పటికే పలుమార్లు విమర్శలు చేసిన శ్రీ రెడ్డి తాజాగా మరోమారు విరుచుకుపడింది . మెగా కుటుంబంతో కాంగ్రెస్ పార్టీ ఆటాడుకుందని విమర్శలు చేస్తున్న పవన్ మీ అన్నయ్య ఆ పార్టీలోనే ఇంకా కొనసాగుతున్నాడు కదా ! అంటూ మరోసారి పవన్ కళ్యాణ్ ని రెచ్చగొడుతోంది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . చిరంజీవి చిన్న కూతురు శ్రీజ శిరీష్ భరద్వాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .

అయితే అప్పటి సంఘటనలో పెళ్లి కార్యక్రమం తర్వాత ఆ జంట ని కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు దేశ రాజధాని ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ వాళ్ళు ఉండటానికి ఏర్పాట్లు చేయడమే కాకుండా జాతీయ ఛానళ్ల ముందు కూర్చోబెట్టి చర్చ పెట్టారని అప్పుడు మా గుండెలు ఎలా మండాయో తెలుసా …… అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసాడు దాంతో శ్రీ రెడ్డి చురకలు అంటిస్తోంది పవన్ కళ్యాణ్ కు అలాగే చిరంజీవికి .

కాంగ్రెస్ పార్టీ ని కూడా పవన్ విమర్శిస్తున్నాడు దాంతో శ్రీ రెడ్డి తిరిగి విమర్శలు చేస్తోంది ఎందుకంటే చిరంజీవి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు , యాక్టివ్ గా తిరగడం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ కి మాత్రం రాజీనామా చేయలేదు . పవన్ కాంగ్రెస్ పార్టీ ని విమర్శిస్తున్నాడు కానీ 2014 కి ముందు వరకు చిరంజీవి కేంద్రమంత్రి గా ఉన్నాడు పైగా కాంగ్రెస్ పార్టీలోనే .

English Title: sri reddy comments onceagain on pawan kalyan