అల్లు అర్జున్ ది విగ్: మరోసారి బన్నీని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి


అల్లు అర్జున్ ది విగ్: మరోసారి బన్నీని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
అల్లు అర్జున్ ది విగ్: మరోసారి బన్నీని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం సంక్రాంతికి షెడ్యూలైన సంగతి తెల్సిందే. ఈ సినిమా మ్యూజికల్ నైట్ నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. అల్లు అర్జున్ ఈసారి ప్రతిసారికి భిన్నంగా చాలా ఎక్కువసేపు ఈవెంట్ లో ప్రసంగించాడు. ఫన్నీగా జోకులేస్తూ మొదలైన అల్లు అర్జున్ ప్రసంగం, తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ గా సాగింది. లాస్ట్ కు సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు బాగా ఆడాలని ఆకాంక్షించాడు.

అల్లు అర్జున్ అనగానే స్టైల్ గుర్తొస్తుంది. అందుకే తనని స్టైలిష్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. స్టైల్ పరంగా సినిమాల్లో ఏదైనా కొత్తగా ప్రయత్నించాలంటే బన్నీ తర్వాతే ఎవరైనా అనే పేరు సంపాదించుకున్నాడు. తన ప్రతిసినిమాలో నటనతో పాటు లుక్స్ పరంగా కొత్తగా ప్రయత్నించడం, డ్యాన్స్ లు, ఫైట్స్ పరంగా కొత్తగా ఏం చేయొచ్చు అనే వాటిని బన్నీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటాడు. అందుకే అల్లు అర్జున్ మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అల వైకుంఠపురములో చిత్రంతో మన ముందుకు వస్తున్న బన్నీపై వివాదాస్పద నటి శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.

“అల్లు అర్జునా ఎప్పుడుకైన నీ ఒరిజినల్ హెయిర్ తో సినిమాల్లోకి వస్తావా? ఎప్పుడూ ఎక్సటెన్షన్స్ విగ్ లేనా” అంటూ శ్రీరెడ్డి అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. అల్లు అర్జున్ తన ప్రతి సినిమాలో హెయిర్ స్టయిల్ పరంగా న్యూ లుక్ కోసం తపిస్తుంటాడు. అలాంటిది బన్నీది ఎక్స్టెన్షన్ విగ్ అంటూ చేసిన వ్యాఖ్యలకు బన్నీ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.

అల్లు అర్జున్ ను టార్గెట్ చేయడం శ్రీరెడ్డికి కొత్తేమి కాదు. గతంలో అల్లు అర్జున్ తన 10 కోట్లు విలువ చేసే వానిటీ వ్యాన్ విశేషాల గురించి సోషల్ మీడియాలో తెలిపినప్పుడు శ్రీరెడ్డి కాంట్రావర్షియల్ కామెంట్స్ చేసింది. కేరళ వరద బాధితులకు సహాయం చేయకుండా ఇలా వానిటీ వ్యాన్స్ కొనుగోలు చేసుకోవడం ఎంతవరకూ కరెక్ట్ అంటూ ఆమె కామెంట్ చేసింది. కేరళలో బన్నీకి విశేషమైన ఫాలోయింగ్ ఉన్నా కానీ వారిని విస్మరించాడు అంటూ దుమ్మెత్తిపోసింది. ఇప్పుడేమో ఏకంగా తనది విగ్ అంటోంది. మరి ఈ వివాదం ఎంతవరకూ వెళుతుందో చూడాలి.