ఆ నటుడి రాసలీలల గురించి ఈమెకు తెలుసా ?


Sri reddy controversial comments on rajendra prasad

సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ పై సంచలన ఆరోపణలు చేసి మరోసారి వివాదాల్లోకొచ్చింది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . రాజేంద్రప్రసాద్ నీ బాగోతం త్వరలోనే బయట పెడతా అంటూ ట్వీట్ చేసి మరింత కాక రేపింది. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన భామ శ్రీ రెడ్డి . కాగా కాస్త ఈ వివాదం సద్దుమణిగింది అని అనుకుంటుండగా తమిళ హీరోయిన్ కీర్తి సురేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్తల్లోకి వచ్చింది కట్ చేస్తే ఇప్పుడు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ త్వరలోనే నీ బాగోతం బయటపెడతా అంటూ సవాల్ విసిరింది అంటే ఈ సీనియర్ నటుడి లీలల గురించి శ్రీ రెడ్డి దగ్గర సమాచారం ఏమైనా ఉందా? లేక ఊరికే సవాల్ విసురుతోందా?

హీరోగా ఓ వెలుగు వెలిగిన రాజేంద్రప్రసాద్ కామెడీతో తనదైన ముద్ర వేసి కామెడీ కి సరికొత్త ఇమేజ్ ని హీరోయిజాన్ని తెచ్చిపెట్టాడు. ఎన్నో అద్భుత విజయాలను అందుకున్న రాజేంద్రప్రసాద్ పై కొన్ని ఆరోపణలు కూడా చాలా రోజులుగా వినబడుతూనే ఉన్నాయి. మరి శ్రీ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ ఎలా స్పందిస్తాడా చూడాలి. ఇక శ్రీ రెడ్డి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ? ఎప్పుడు బయట పెడుతుంది. లేక ట్వీట్ లతోనే కాలం వెళ్లదీస్తుందా చూడాలి.

English Title: Sri reddy controversial comments on rajendra prasad