విశాల్ నుండి ప్రాణహాని ఉందంటున్న శ్రీ రెడ్డి


sri reddy fearing threat from hero vishal

తమిళ స్టార్ హీరో విశాల్ నుండి నాకు ప్రాణహాని ఉందని సంచలన ఆరోపణలు చేస్తోంది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . తెలుగునాట శ్రీ రెడ్డి లీక్స్ అంటూ ప్రభంజనం సృష్టించిన ఈ భామ తాజాగా తమిళ ఇండస్ట్రీ పై పడింది . తెలుగు కుర్రాడు అయిన శ్రీ రామ్ తమిళ్ లో శ్రీకాంత్ పేరుతో నటిస్తున్నాడు కాగా ఆ హీరో సినిమాలో ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చి నన్ను వాడుకున్నాడని , ఆ అవసరం తీర్చుకొని ఇంతవరకు సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదని ఆరోపించిన ఈ భామ దర్శకులు మురుగదాస్ పై కూడా విమర్శలు చేస్తోంది .

ఇక విశాల్ విషయానికి వస్తే …… నాకు అతడి నుండి ఇబ్బంది ఉందని అయినప్పటికీ భయపడేది లేదని అంటోంది . ఇంకా తమిళనాట లీక్స్ చేయాల్సినవి ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే చేస్తానని అంటోంది . అయితే విశాల్ పై ఆరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తోంది ఎందుకంటే నాని పై శ్రీ రెడ్డి ఆరోపణలు చేసినప్పుడు నాని గురించి నాకు బాగా తెలుసనీ , ఒకవేళ శ్రీ రెడ్డి దగ్గర ఆధారాలు ఉంటే వాటిని బయటపెట్టాలని అన్నాడు అంతేకాదు శ్రీ రెడ్డి నాపై ఆరోపణలు చేసిన ఆశ్చర్యం లేదని నెల కిందటే అన్నాడు కట్ చేస్తే ఇప్పుడు విశాల్ పై ఆరోపణలు చేస్తోంది శ్రీ రెడ్డి . మరి ఇప్పుడు విశాల్ ఎలా స్పందిస్తాడో చూడాలి .

English Title: sri reddy fearing threat from hero vishal