పవన్ కళ్యాణ్ ని ఘోరంగా అవమానించిన శ్రీరెడ్డి


Sri Reddy fires on Pawan Kalyan once again and asks for his credibility

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఘోరంగా అవమానించింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి . ఓటు వేయమని అడుగుతున్నావు ….. నీకున్న క్రెడిబిలిటీ ఏంట్రా ? అంటూ ఏకవచనంతో సంబోదించి సంచలనం సృష్టిస్తోంది శ్రీరెడ్డి . ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని ” మా …… ద్ ” అంటూ తిట్టిన శ్రీరెడ్డి తాజాగా మరోసారి నిప్పులు చెరిగింది .

 

 

నువ్వు చెబితే ఓట్ వేయడానికి, వద్దంటే మానేయడానికి అసలు నీకున్న క్రెడిబిల్టీ ఏంటి?

ఏం అర్హత ఉంది నీకు..?

సినిమాల్లో నువ్వేసిన నాలుగు పిచ్చి గంతులా?

లేక నీ అత్యున్నత విద్యాభ్యాసమా ?

లేక నీ వ్యక్తిగత జీవితంలో ఒకటికి మూడు సార్లు సాధించిన ఘన విజయాలా?

లేక నీ సోదరుడు పెట్టి జనాలను ముంచి మీరు లబ్ది పొందిన గత పార్టీ అనుభవాలా?

కనీసం ఒక విలేకరి అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పలేని నీ అత్యున్నత జ్ఞాన సంపదా?

నిశ్చల తత్వం లేని నీ స్వభావమా?

కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి నువ్వు సాధించిన విజయాలా?

కనీసం 10 నిముషాలు స్థిరంగా నుంచొని మాట్లాడలేని నీ అస్థిర మనస్థత్వమా ?

లేక ఒక సినీ నటుడిగా నీ హంగు ఆర్భాటాలా?

అంతర్గత ఒప్పందాలతో పార్టీలు స్థాపించే మీ మంచి వ్యాపార నైపుణ్యం చూసా?

ఎప్పుడు ఎవరిని ఎందుకు సమర్ధించామో ఎందుకు వ్యతిరేకిస్తున్నామో తెలియని మీ వ్యూహచతురత చూసా?

మీ కుటుంబంలో వ్యక్తుల గత పాలన అనుభవాలు….. విజయాలు చూసా?

విలేకరికి సమాధానం చెప్పలేని మీరు రేపు అంతర్జాతీయ ఒప్పందాలతో ప్రపంచ దిగ్గజాలతో పోటీ పడి పరిశ్రమలను ఆంధ్రకు తరలిస్తారాన్న ఆశతోనా?

దేనికి నమ్మాలి నిన్ను…ఒక చిన్న ఉద్యోగానికే ఎన్నో అర్హతలు చూసే ఈ పోటీ ప్రపంచంలో ఏ నమ్మకం ఏ అర్హత లేని నీకు ఓట్ ఎందుకు వెయ్యాలి…

మీవి కడుపు నిండిన బతుకులు..మావి కాదురా…….

నెల జీతాల మీద ఆధారపడిన బతుకులు…

అన్ని ఉన్న నీకు ఇది ఆట కావచ్చు కానీ…… మాకు జీవితం..మా బిడ్డల భవిష్యత్