రామానాయుడు స్టూడియోస్ మా ఫస్ట్ నైట్ ప్లేస్ : శ్రీరెడ్డి



రామానాయుడు స్టూడియోస్ మా ఫస్ట్ నైట్ ప్లేస్ : శ్రీరెడ్డి
రామానాయుడు స్టూడియోస్ మా ఫస్ట్ నైట్ ప్లేస్ : శ్రీరెడ్డి

శ్రీరెడ్డి అంటేనే వివాదాల పుట్ట. మాములు విషయాన్ని కూడా వివాదం చేసుకోగల నైపుణ్యం ఆమె సొంతం. గతంలో ఎన్నో వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వచ్చిన శ్రీరెడ్డి గత కొంత కాలంగా సైలెంట్ గా ఉంది. తమిళనాడు వెళ్ళిపోయి అక్కడ విశాల్ తదితర నటులపై సంచలన కామెంట్స్ చేసి కాలం వెళ్లదీసింది. అడపాదడపా టాలీవుడ్ లో కొందరు నటులను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించే శ్రీరెడ్డి ఇప్పుడు రామానాయుడు స్టూడియోస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

2018లో రామానాయుడు మనవడు, సురేష్ బాబు కొడుకు అభిరామ్ తనను ప్రేమించానని చెప్పి మోసం చేసాడని, అవకాశాలు ఇప్పిస్తానని తనతో చాలా క్లోజ్ గా కూడా మూవ్ అయ్యాడని వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారమే రేపింది. దీనికి ప్రూఫ్స్ అంటూ ఇద్దరూ క్లోజ్ గా ఉన్న కొన్ని ఫోటోలు, వాట్సాప్ చాట్ లను రివీల్ చేసింది. అప్పట్లో సంచలనమైన ఈ వార్త క్రమంగా కనుమరుగైంది. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలీదు కానీ అది పూర్తిగా కనుమరుగయ్యాక మళ్ళీ శ్రీరెడ్డి దాన్ని లేపడం విశేషం.

రామానాయుడు స్టూడియోస్ ను ఒక ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థకు సురేష్ బాబు అమ్మేసినట్లు వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే. ఎన్నో సినిమాలు షూటింగ్ లు జరిగిన నానక్ రామ్ గూడలోని ఆ చోటు ఇక సినిమా షూటింగ్ లు చేసుకోవడానికి వీలుండదు అని తెలియడంతో కొందరు ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నారు. అది ఒక ఐకానిక్ ప్లేస్ అని వ్యాఖ్యానిస్తున్నారు. సురేష్ బాబు వైజాగ్ లో నిర్మితమైన రామానాయుడు స్టూడియోస్ ను డెవలప్ చేయనున్నాడని సమాచారం.

ఇప్పుడు ఈ వార్తపై శ్రీరెడ్డి స్పందిస్తూ నాకు, అభిరామ్ కు ఫస్ట్ నైట్ జరిగిన ఈ ప్లేస్ ఇక ఉండబోవట్లేదు అని వ్యాఖ్యానించింది. దీనిపై నెటిజన్లు ఎవరికి తోచినట్లుగా వారు రియాక్ట్ అవుతున్నారు. కొందరు శ్రీరెడ్డికి మద్దతిస్తుంటే, మరికొందరు ఆమెను తిట్టిపోస్తున్నారు. నీకు ఇష్టమై తిరిగి ఇప్పుడు ఇలా విమర్శించడం బాలేదంటూ చురకలు అంటిస్తున్నారు. ఏదేమైనా శ్రీరెడ్డి మరో వివాదం లేపడంలో సక్సెస్ అయింది.