శ్రీ రెడ్డిని తొక్కేసిన నాని, ఇప్పుడు బిగ్ బాస్ లోకి


Sri reddy in bigg boss 3

తెలుగు బిగ్ బాస్ 2 లో వివాదాస్పద భామ శ్రీ రెడ్డి పాల్గొనాల్సి ఉండే కానీ నాని హోస్ట్ గా వ్యవహరించడం వల్ల బిగ్ బాస్ 2 లో శ్రీ రెడ్డి ని తీసుకోలేకపోయారు దాంతో నన్ను నాని తొక్కేసాడు అంటూ శ్రీ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే . కట్ చేస్తే ఇప్పుడు ముచ్చటగా మూడో బిగ్ బాస్ రెడీ అవుతోంది . అందులో ఈ వివాదాస్పద భామ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది అంతేకాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మూడో పార్ట్ కు హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు చెప్పకనే చెప్పింది శ్రీ రెడ్డి .

 

ఎన్టీఆర్ మొదటి సిరీస్ కు హోస్ట్ గా వ్యవహరించాడు . అయితే ప్రారంభంలో డిజాస్టర్ అనుకున్న షోని రానురాను తన వ్యాఖ్యానంతో సూపర్ హిట్ చేసాడు ఎన్టీఆర్ . కట్ చేస్తే రెండో పార్ట్ కి మాత్రం నాని హోస్ట్ గా వ్యవహరించాడు . ఇక ఇప్పుడేమో మూడో సిరీస్ కు మళ్ళీ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది . ఇక శ్రీ రెడ్డి ఈ మూడో సిరీస్ లో పాల్గొంటోంది . శ్రీ రెడ్డి పాల్గొంటే ఇక బిగ్ బాస్ షో గురించి కొత్తగా చెప్పేదేముంది రచ్చ రచ్చే !

English Title : Sri reddy in bigg boss 3