తమిళ బిగ్ బాస్ 3 లో శ్రీరెడ్డి ?

కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో సంచలనం సృష్టించిన భామ శ్రీ రెడ్డి కాగా ఈ భామ తమిళ బిగ్ బాస్ 3 లో పార్టిసిపేట్ చేయనున్నట్లు తెలుస్తోంది . తెలుగు బిగ్ బాస్ లో పాల్గొనాలని భావించింది శ్రీరెడ్డి అయితే కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది టాలీవుడ్ పైనే కావడంతో బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న వాళ్ళు శ్రీ రెడ్డి ని తీసుకోవడానికి అంగీకరించడం లేదు దాంతో తమిళనాట ట్రై చేసింది సక్సెస్ అయ్యింది .

కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్ బాస్ 3 లో శ్రీ రెడ్డి పాల్గొన్నట్లుగా తెలుస్తోంది . త్వరలోనే తమిళ బిగ్ బాస్ స్టార్ట్ కానుంది . ఇక తెలుగులో కూడా రంగం సిద్ధం అవుతోంది , రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఫైనల్ లిస్ట్ మాత్రం రాలేదు . టాలీవుడ్ లో వివాదాన్ని రాజేసిన శ్రీరెడ్డి కోలీవుడ్ లో ఏం చేస్తుందో ఏమో !