పవన్ కల్యాణ్ ఎవరో తెలియదంటున్న శ్రీరెడ్డి


Sri reddy insults once again pawankalyan

పవన్ కల్యాణ్ ని ఇప్పటికే పలుమార్లు ఘోరంగా విమర్శించిన శ్రీరెడ్డి తాజాగా మరోసారి దారుణంగా విమర్శించింది. పవన్ అంటే నాకు తెలిసి మంచి పెయింటర్ , గోడల మీద పెయింట్ లు వేసే పవన్ తప్ప నాకు మరో పవన్ గురించి తెలియదు , అయినా పవన్ ఏమన్నా గొప్పోడా తెలుసుకోవడానికి అంటూ తాజాగా కామెంట్ చేసి పవన్ కల్యాణ్ ని అలాగే నాగబాబు ని మెగా ఫ్యాన్స్ ని కెలికింది.

అంతేనా …… రాజకీయంగా కూడా దారుణంగా విమర్శించింది శ్రీరెడ్డి. పెళ్లి మీద పెళ్లి చేసుకుంటూ అదేదో లోక కల్యాణం కోసం పెళ్లిళ్లు చేసుకుంటున్నట్లు ఫోజు కొట్టే పవన్ గురించి నాకు తెలియదు అంటూ వెటకారంగా మాట్లాడింది. అలాగే పవన్ కల్యాణ్ రాజకీయాలలోకి వచ్చి చేసేది ఏమి లేదని ఘోర పరాజయం పొందడం ఖాయమనే రీతిలో మాట్లాడింది శ్రీరెడ్డి. ఇదంతా ఎందుకంటే నాగబాబు బాలయ్య ఎవరో తెలీదు అంటూ బాలయ్య ని విమర్శించడమే కారణం . మొత్తానికి ఈ లొల్లి ఇప్పట్లో చల్లారేలా లేదు.

English Title: Sri reddy insults once again pawankalyan