శ్రీ రెడ్డి జగన్ పార్టీ తరుపున పోటీ చేస్తుందా


sri reddy joined ysrcp and contesting in 2019 elections!వివాదాస్పద నటి శ్రీ రెడ్డి 2019 లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తుందా ? జగన్ పార్టీ అయిన వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరుతుందా ? ఇప్పుడు అందరి మనసుల్లో తొలుస్తున్న ప్రశ్న ఇదే. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయాలంటే అతడి నోరు మూత పడాలంటే శ్రీ రెడ్డి వాయిస్ కావాల్సిందే అని అనుకుంటున్నాడట జగన్ . పవన్ కళ్యాణ్ జగన్ పై ఆరోపణలు చేయడంతో జగన్ కూడ తీవ్ర స్థాయిలో విమర్శించాడు. ఏకంగా పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని , కార్లని మార్చినంత వేగంగా పెళ్లాలను మార్చాడని సంచలన వ్యాఖ్యలు చేసాడు జగన్ . దానికి ధీటుగా పవన్ కళ్యాణ్ అలాగే పవన్ మనుషులు జగన్ ని తూర్పారబట్టారు అంతేకాదు జగన్ సోదరి షర్మిల పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

 

జగన్ ని విమర్శిస్తే సరిపోయేది కానీ షర్మిల పై చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు కావడంతో పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. షర్మిల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని ట్వీట్ పెట్టాడు పవన్ . అయితే పవన్ కళ్యాణ్ మనుషులు షర్మిల పై వ్యాఖ్యలు చేయడంతో వివాదాస్పద నటి శ్రీ రెడ్డి స్పందించింది. పవన్ కళ్యాణ్ ని ఘోరంగా విమర్శించి రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. జగన్ ఛానల్ అయిన సాక్షి లో కొంతకాలం పనిచేసింది శ్రీ రెడ్డి దాంతో జగన్ పార్టీ లో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందేమో అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శ్రీ రెడ్డి పోటీ చేస్తుందా ? లేదా అనేది పక్కన పెడితే రాజకీయంగా మాత్రం పవన్ కళ్యాణ్ ని ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

English Title: sri reddy joined ysrcp and contesting in 2019 elections!