శ్రీ‌రెడ్డి కొత్త బిజినెస్ అదిరింద‌ట‌గా!


శ్రీ‌రెడ్డి కొత్త బిజినెస్ అదిరింద‌ట‌గా!
శ్రీ‌రెడ్డి కొత్త బిజినెస్ అదిరింద‌ట‌గా!

శ్రీ‌రెడ్డి… టాలీవుడ్‌లో ఈ పేరు ఏ స్థాయి ప్ర‌కంప‌ణ‌లు సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. రెండు నెల‌ల పాటు ఇండ‌స్ట్రీలో మంట‌లు పెట్టిన శ్రీ‌రెడ్డి ఇప్పుడు వంట‌లు చేస్తోంది. వ‌రుస వీడియోల‌తో యూట్యూబ్‌ని నింపేస్తోంది. తెలుగులో ర‌చ్చ చేసి దిగ్గ‌జాల‌కు వ‌ణుకు పుట్టించిన ఆమె గ‌త కొంత కాలంగా వ‌రుస పోస్ట్‌ల‌తో స్టార్ హీరో, జ‌ప‌సేన అధినేత‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి వార్త‌ల్లో కెక్కింది.

ఈ నాట‌కం అంతా శ్రీ‌రెడ్డితో తానే ఆడించాన‌ని, మెగా ఫ్యామిలీ హీరోల‌ని టార్గెట్ చేయ‌డం కోస‌మే త‌ను అలా చేశాన‌ని వ‌ర్మ చెప్ప‌డంతో వివాదం మ‌రో ట‌ర్న్ తీసుకుంది. మీడియా ముఖంగా రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు అల్లు అర‌వింద్ వార్నింగ్ ఇవ్వ‌డంతో వివాదం స‌ద్దుమ‌నిగింది. కానీ ఆ త‌రువాత కూడా కొన్ని రోజులు వ‌రుసపోస్ట్‌ల‌తో నాగ‌బాబుపై, ప‌వ‌న్‌పై ఫేస్‌బుక్ పేజ్‌లో వివాదాస్ప‌ద పోస్ట్ చేసిన శ్రీ‌రెడ్డి ఎల‌క్ష‌న్‌ల హ‌డావిడి త‌గ్గ‌డంతో తాజాగా కొత్త రాగం అందుకుంది.

కొత్త‌గా యూట్య‌బ్ ఛాన‌ల్‌ని ప్రారంభించి అందులో కొంత మందిని తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న ఆమె తాజాగా వంట‌ల వీడియోల‌ని పోస్ట్ చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇప్పుడు ఆమె ఛాన‌ల్ యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ల‌క్ష‌ల్లో వ్యూస్ రావ‌డంతో శ్రీ‌రెడ్డి బిజినెస్ అదిరిపోయిందిలే అంటున్నారంతా.