అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న నాని : శ్రీరెడ్డి వివాదాస్పద కామెంట్


Sri reddy Once again sensational comments on hero nani

నాని పై మరోసారి వివాదాస్పద కామెంట్ చేసి సంచలనం సృష్టించింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. ఇంతకుముందు కూడా నాని పై వివాదస్పద వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. నాని పేరు ని అప్పట్లో నేరుగా ప్రస్తావించలేదు కానీ న్యాచురల్ స్టార్ అంటూ వ్యాఖ్యలు చేసింది. తెరమీదే కాదు తెరవెనుక కూడా ఈ న్యాచురల్ స్టార్ న్యాచురల్ గా నటిస్తాడాని , చిన్న ,కొత్త దర్శకులంటే అస్సలు గౌరవం ఇవ్వడని ఇతడు మహేష్ బాబు , ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్ లను చూసి నేర్చుకోవాలని చురకలు అంటించింది కూడా.

ఇక ఇప్పుడేమో మరోసారి నాని పై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నాని అమ్మాయిల జీవితాలను తొక్కేస్తూ పైకి ఎదిగాడాని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ఒక వారం , పది రోజుల పాటు సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి మళ్లీ ఇండస్ట్రీ వాళ్ల పై విరుచుకు పడుతోంది. అంతేకాదు లీగల్ గా కూడా పలువురు ప్రముఖులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నాని పై ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి అభిప్రాయం ఉంది కాని శ్రీరెడ్డి ఆరోపణలు నేపథ్యంలో నాని ఎలా స్పందిస్తాడో చూడాలి.