శ్రీ రెడ్డి ని తీసెయ్యడానికి కారణం నాని


sri reddy out from bigg boss 2 వివాదాస్పద నటి శ్రీ రెడ్డి ని బిగ్ బాస్ 2 లో ఒక పోటీదారుగా అనుకున్నారు కట్ చేస్తే హీరో నాని ఆమె ని ఎంపిక చేయకుండా అడ్డు పడటమే కాకుండా తన పంతాన్ని నెగ్గించుకున్నారు దాంతో శ్రీ రెడ్డి కి షాక్ ఇచ్చారు బిగ్ బాస్ 2 నిర్వాహకులు . శ్రీ రెడ్డి పలు వివాదాలు సృష్టించడమే కాకుండా హీరో నాని పై పలు విమర్శలు చేసింది . నాని అమ్మాయిలను వాడుకొని వదిలేసే రకమని , అతడి కాపురంలో చిచ్చు పెడతానని అనడమే కాకుండా అందరూ కెమెరా వెనకాల మాత్రమే నటిస్తారు కానీ నాని మాత్రం నిజ జీవితంలో కూడా నటిస్తాడు అంటూ ఘాటు విమర్శలు చేసి నాని కి నిద్ర లేకుండా చేసింది .

దాంతో అలాంటి వివాదాస్పద నటి శ్రీ రెడ్డి ఉంటే బిగ్ బాస్ 2 హోస్ట్ చేయలేను అంటూ ఖరాఖండి గా చెప్పాడట ! దాంతో శ్రీ రెడ్డి ని బిగ్ బాస్ 2 లోకి తీసుకోలేదని తెలుస్తోంది . ఇప్పటికే నాని పై పలు ఆరోపణలు చేసింది శ్రీ రెడ్డి , ఇక ఇప్పుడు బిగ్ బాస్ 2 కి అడ్డుగా నాని ఉంటే ఆగుతుందా మరిన్ని విమర్శలు ఎక్కుపెట్టడం ఖాయం . మొత్తానికి మరోసారి శ్రీ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఖాయం .