దర్శక నిర్మాతపై కేసు పెట్టిన శ్రీరెడ్డి


sri reddy police complaint against kollywood director and producerవివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి సంచలనం సృష్టించింది . తమిళ దర్శక నిర్మాత అయిన ” వారాహి ” పై చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది , వెంటనే అతడి పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతోంది శ్రీ రెడ్డి . ఇన్నాళ్లు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూ టాలీవుడ్ ని షేక్ చేసిన శ్రీ రెడ్డి తాజాగా తమిళ సినిమా వాళ్లపై పడింది . ఇప్పటికే పలువురు తమిళ సినీ ప్రముఖులపై ఆరోపణలు చేయగా అందుకు ప్రతిగా శ్రీ రెడ్డి పై వారాహి అనే తమిళ దర్శక నిర్మాత ఆరోపణలు చేసాడు . అంతేకాదు శ్రీ రెడ్డి ని వేశ్యతో పోల్చాడు దాంతో హర్ట్ అయిన శ్రీ రెడ్డి చెన్నై పోలీసులను ఆశ్రయించింది .

ఫిర్యాదు అయితే చేసింది కానీ చెన్నై పోలీసులు ఇంకా వారాహి పై కేసు నమోదు చేయలేదు . కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో సంచలనం సృష్టిస్తున్న శ్రీ రెడ్డి గురించి తమిళ పోలీసులకు కూడా తెలియడంతో కావచ్చు ఇంకా కేసు నమోదు చేయలేదు . అయితే శ్రీ రెడ్డి కి తమిళనాట అవకాశాలు ఇస్తానని ప్రకటించి సంచలనం సృష్టించింది కుట్టి పద్మిని . ఆమె అవకాశాలు ఇస్తానని చెప్పడంతో ఇక హైదరాబాద్ లో కాకుండా చెన్నై లోనే స్థిరపడతానని అంటోంది శ్రీ రెడ్డి . మరి అక్కడ స్థిరపడుతుందా ? లేక మళ్ళీ హైదరాబాద్ బాట పడుతుందా చూడాలి .

English Title: sri reddy police complaint against kollywood director and producer