శ్రీ రెడ్డి ఓటు ఎవరికో తెలుసా


Sri Reddy promoting Sivaji Raja

వివాదాస్పద భామ శ్రీ రెడ్డి మా ఎన్నికల్లో పోటీ పడుతున్న రెండు ప్యానల్ లలో ఎవరు బెస్టో చెబుతోంది అంతేకాదు నా ఓటు శివాజీరాజా ప్యానల్ కే , అలాగే మీరు కూడా శివాజీరాజా ప్యానల్ నే గెలిపించండి అంటూ సపోర్ట్ చేస్తోంది . అయితే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో శ్రీ రెడ్డి కి సభ్యత్వం లేదు . ఆ సభ్యత్వం కోసమే కదా ! అర్ధనగ్న ప్రదర్శన చేసి రచ్చ రచ్చ చేసింది .

 

ఈనెల 10 న మా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శివాజీరాజా ప్యానల్ అలాగే నరేష్ ప్యానల్ పోటీ పడుతోంది . శివాజీరాజా ప్యానల్ కు నా మద్దతు ఉంటుందని చెప్పడమే కాకుండా అతడినే గెలిపించాలని ప్రచారం చేస్తోంది శ్రీ రెడ్డి . ఇక అమ్మాయిలను సప్లయ్ చేసే వాళ్ళకు ఓటేయకండి , గెలిపించకండి అంటూ కూడా వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టింది శ్రీ రెడ్డి . నరేష్ ప్యానల్ లో డాక్టర్ రాజశేఖర్ – జీవితలను టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి .

English Title : Sri Reddy promoting Sivaji Raja