పవన్ కళ్యాణ్ ని నక్కతో పోల్చిన శ్రీ రెడ్డిsri reddy sensational comments again pawan kalyan

పవన్ కళ్యాణ్ ని నక్క తో పోల్చి సంచలన వ్యాఖ్యలు చేసింది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . జుట్టు కి రంగేసుకొని , గడ్డానికి పెయింటింగ్ వేసుకొని అరుస్తూ ప్రసంగిస్తే చేగువేరా అవుతారా ? నిద్రలేవండీ గొర్రెల్లారా !అసలే ఇది వర్షాకాలం రా నాయనా ….. వానలోకి వెళ్లోద్దని చెప్పండి లేదంటే రంగు వెలిసి పోతుంది పులి వేషం వేసుకున్న మీ పవన్ కళ్యాణ్ ది అంటూ ఘోరమైన కామెంట్స్ చేస్తోంది పవన్ కళ్యాణ్ ని . గతకొంత కాలంగా పవన్ కళ్యాణ్ ని తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తోంది శ్రీ రెడ్డి .

ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ ని విమర్శించిన శ్రీ రెడ్డి తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడి రియల్ హీరో అంటే పరిటాల రవి అంతేకాని పవన్ కళ్యాణ్ కాదు అంటూ మరింతగా పవన్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతోంది . అంతేనా పరిటాల రవి ఇప్పుడుంటే కథ మరోలా ఉండేదని పరోక్షంగా ఎప్పుడో పరిటాల రవి కి పవన్ కళ్యాణ్ కు జరిగిన సంఘటన ని చెప్పకనే చెబుతోంది శ్రీ రెడ్డి . పవన్ కళ్యాణ్ కు పరిటాల రవి గుండు కొట్టించాడని అప్పట్లో సంచలనాత్మక కథనాలు వెలువడిన విషయం తెలిసిందే అయితే అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే అని పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి పరిటాల సునీత కూడా ఖండించిన విషయం తెలిసిందే .ఈ విషయాన్నీ పక్కన పెడితే పరిటాల రవి ఇప్పుడు ఉపయోగించుకొని పవన్ పై ఆరోపణలు చేయడం మాత్రం పవన్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించే అంశమే !

English Title: sri reddy sensational comments again pawan kalyan