లారెన్స్ పై ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి


sri reddy sensational comments on lawrence raghava

వివాదాస్పద నటి శ్రీ రెడ్డి తాజాగా రాఘవ లారెన్స్ పై సంచలన ఆరోపణలు చేసింది . గోల్కొండ హోటల్ లోని తన రూమ్ కి నన్ను తీసుకెళ్లిన లారెన్స్ అక్కడ తన మంచితనం గురించి చెబుతూ మెల్లిగా నా నడుము ని చూపించమని కోరడమే కాకుండా నా శరీర భాగాలను చూపించమని పోరు పెట్టి మొత్తానికి నన్ను పూర్తిగా ఆక్రయించేసుకున్నాడు , తర్వాత నీకు తప్పనిసరిగా ఛాన్స్ లు ఇస్తానని చెప్పి ఆ మాట నిలుపుకోలేకపోయాడని అందుకు కారణం నిర్మాత బెల్లంకొండ సురేష్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది శ్రీ రెడ్డి .

రాఘవ లారెన్స్ తెలుగు , తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడన్న విషయం తెలిసిందే . హర్రర్ చిత్రాలతో తెలుగు , తమిళనాట ప్రభంజనం సృష్టించాడు లారెన్స్ అయితే అలాంటి లారెన్స్ ని టార్గెట్ చేస్తూ నన్ను వాడుకున్నాడని ఆరోపించడం సంచలనం గా మారింది . ఇప్పటికే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి పలువురి భాగోతాన్ని బయటపెట్టిన శ్రీ రెడ్డి తాజాగా తమిళ వాళ్లపై పడింది . దర్శకులు మురుగదాస్ తో పాటు తమిళ హీరో శ్రీకాంత్ పై ఆరోపణలు చేసిన ఈ భామ తాజాగా లారెన్స్ ని కూడా వదలలేదు . మరి లారెన్స్ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తాడో చూడాలి .

English Title: sri reddy sensational comments on lawrence raghava