తమిళ డైరెక్టర్ పై ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి


sri reddy sensational comments on murugadossవివాదాస్పద నటి శ్రీ రెడ్డి తాజాగా తమిళ దర్శకులు మురుగదాస్ పై ఆరోపణలు చేసి మరోసారి సంచలనం సృష్టిస్తోంది . మురుగదాస్ గారు మనిద్దరం గ్రీన్ పార్క్ హోటల్ లో కలిసాం , నన్ను రచయిత వెలిగొండ శ్రీనివాస్ మీకు పరిచయం చేసాడు ….. కాగా ఆ హోటల్ లో మనం కలుసుకున్న సమయంలో నాకు తప్పకుండా ఛాన్స్ లు ఇస్తానని మాటిచ్చారు నేను నమ్మాను కానీ ఇప్పటివరకు కూడా మీ నుండి నాకు కాల్ ఇంతవరకు రాలేదు మీరు గ్రేట్ సార్ అంటూ ట్వీట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది .

గత మూడు నెలలుగా శ్రీ రెడ్డి లీక్స్ అంటూ ఫిలిం నగర్ లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది . ఇప్పటికే పలు సంచలనాలు సృష్టించిన ఈ భామ తాజాగా తమిళ దర్శకుడు మురుగదాస్ పై ఆరోపణలు చేయడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది . ఇన్నాళ్లు తెలుగు వాళ్ళ నే టార్గెట్ చేసి ఉంటుందని అనుకున్నారు కానీ తాజా సంఘటనతో తమిళ దర్శకుడు కూడా ఉన్నాడని తెలుస్తోంది .

తెలుగు , తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు మురుగదాస్ . ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ తో సర్కార్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు మురుగదాస్ . ఆ చిత్రాన్ని నవంబర్ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: sri reddy sensational comments on murugadoss