చంద్రబాబుకి అండగా నిలిచిన శ్రీ రెడ్డి

Sri reddy supports to chandrababu వివాదాస్పద భామ శ్రీ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు మద్దతుగా నిలిచింది . రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి అవుతారని ఆకాంక్షించింది శ్రీ రెడ్డి . ఈరోజు హైదరాబాద్  , ఆంధ్రప్రదేశ్ ఇలా ఉందంటే అందుకు కారణం మీ కృషి అంటూ చంద్రబాబు ని ఆకాశానికి ఎత్తేసింది అయితే వచ్చే ఎన్నికల్లో ఒకవేళ చంద్రబాబు ఓడిపోతే మాత్రం అది ఆంద్రప్రదేశ్ ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించింది .

 

మే నెలలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే . పార్లమెంట్ తో పాటుగా శానససభకు కూడా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చంద్రబాబు పై ముప్పేట దాడి మొదలయ్యింది . ఒకవైపు జగన్ , మరోవైపు మోడీ , కేసీఆర్ లు చంద్రబాబు ని ఓడించాలని కసిగా ఉన్నారు . అయితే చంద్రబాబు ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ మోడీ , జగన్ , కేసీఆర్ ల దాడులతో చంద్రబాబు పై సానుభూతి వ్యక్తం అవుతోంది .

English Title : Sri reddy supports to chandrababu