సీనియర్ నటుడు నరేష్ పై విమర్శలు చేసిన శ్రీ రెడ్డి


 Sri Reddy targets Naresh

వివాదాస్పద భామ శ్రీ రెడ్డి తాజాగా మరోసారి విమర్శలు ఎక్కుపెట్టింది అయితే ఈసారి సీనియర్ నటుడు నరేష్ పైన అలాగే సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ జీవిత దంపతుల పైన . రాజశేఖర్ – జీవిత ల పేర్లు ఎక్కడా నేరుగా ప్రస్తావించలేదు కానీ మీ పక్కన ఉన్నవాళ్లు అంటూ విమర్శలు చేసింది శ్రీ రెడ్డి . టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంటూ ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి తాజాగా మళ్ళీ ఆ విమర్శలు చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది .

 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 10 న జరుగనున్న నేపథ్యంలో శివాజీ రాజా తన ప్యానల్ ని ప్రకటించగా సీనియర్ నటుడు నరేష్ కూడా తన ప్యానల్ ని ప్రకటించాడు . నరేష్ ప్యానల్ లో జీవిత ప్రధాన కార్యదర్శి గా పోటీ చేస్తుండగా రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాడు . రెండు ప్యానల్లు పోటీ పడుతుండటంతో పెద్ద గొడవే అయ్యేట్లు కనిపిస్తోంది మా ఎన్నికల్లో .

English Title : Sri Reddy targets Naresh