హైపర్ ఆదిని చెప్పుతో కొడతానన్న శ్రీ రెడ్డి


actress sri reddy warns hyper aadi

జబర్దస్త్ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాం లో రాణిస్తున్న హైపర్ ఆది పై నిప్పులు చెరగడమే కాకుండా చెప్పుతో కొడతానని హెచ్చరించింది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . హైపర్ ఆది ఇటీవల చేసిన ఓ స్కిట్ లో శ్రీ రెడ్డి ని పోలేలా షర్ట్ ని విప్పరా …… ఇంటర్నేషనల్ గా ఫేమస్ అవుతావు అంటూ కామెంట్ చేసాడు . అంతేకాదు చంద్రబాబు పై ఆయన ప్రభుత్వం పై కూడా చురకలు అంటించాడు అదే స్కిట్ లో . ఒకవైపు శ్రీ రెడ్డి ని చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పలు డైలాగ్స్ చెప్పాడు దాంతో శ్రీ రెడ్డి కోపం నషాళానికి ఎక్కింది .

అంతే హైపర్ ఆది ని చీల్చి చెండాడుతూ చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చింది . గతంలో కూడా ఇలాగే కొంతమంది ని టార్గెట్ చేస్తే వాళ్ళు కమెడియన్ వేణు పై దాడి చేసిన విషయం తెలిసిందే . కాగా శ్రీ రెడ్డి తాజాగా ఆ సంఘటన ని ఉదహరిస్తూ నువ్వు కూడా ఇలాగే నీ వేషాలు కొనసాగిస్తే చెప్పు దెబ్బలు తప్పవు , ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్కిట్ చెయ్ అంటూ ఓ వీడియో ని పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి .