`తెల్ల‌వారితే గురువారం` ఫ‌స్ట్ లుక్

`తెల్ల‌వారితే గురువారం` ఫ‌స్ట్ లుక్
`తెల్ల‌వారితే గురువారం` ఫ‌స్ట్ లుక్

సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ కుమారుడు శ్రీ సింహా కోడూరి తొలి చిత్రం `మ‌త్తు వద‌ల‌రా`తో హీరోగా ప‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం తో న‌టుడిగా మంచి మార్కుల‌తో పాటు ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ త‌రువాత మ‌రో కొత్త త‌ర‌హా క‌థ‌తో .. భిన్న‌మైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

శ్రీ‌సింహా న‌టిస్తున్న తాజా చిత్రం `తెల్ల‌వారితే గురువారం`. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసింది. మ‌ణికాంత్ గెల్లి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. పెళ్లి కొడుకు గెట‌ప్‌లో శ్రీ‌సింహా ఆశ్చ‌ర్యంగా చూస్తూ కుర్చీలో కూర్చున్న ఫ‌స్ట్ లుక్ ఆక‌ట్టుకుంటోంది. పోస్ట‌ర్‌ని బ‌ట్టి చూస్తే ఇదొక ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అని తెలుస్తోంది.

వారాహి చ‌ల‌న చిత్రం, లౌక్యా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై నిర్మాత సాయి కొర్ర‌పాటి స‌మర్ప‌ణ‌లో రజిని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర శుక్లా, మిషా నారంగ్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. విభ‌న్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మార్చిలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.