శ్రీ‌సింహా హీరోగా `భాగ్ సాలే`

శ్రీ‌సింహా హీరోగా `భాగ్ సాలే`
శ్రీ‌సింహా హీరోగా `భాగ్ సాలే`

కీర‌వాణి త‌న‌యుడు శ్రీ‌సింహా కోడూరి హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `భాగ్ సాలే`. డి. సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యాన‌ర్స్‌పై మ‌ధుర శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, య‌ష్ రంగినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ప్ర‌వీణ్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రాన్ని మ‌ధుర శ్రీ‌ధ‌ర్‌రెడ్డి మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు.

మంగ‌ళ‌వారం హీరో శ్రీ‌సింహా పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని కూడా విడుద‌ల చేశారు. `మ‌త్తు వ‌ద‌ల‌రా`, తెల్లారితే గురువారం వంటి విభిన్న చిత్రాల త‌రువాత శ్రీ‌సింహా న‌టిస్తున్న మూడ‌వ చిత్ర‌మిది. క్రైమ్ కామెడీ జాన‌ర్‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఫ‌స్ట్ లుక్ లో శ్రీ‌సింహా షాడో లుక్‌… టైటిల్‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌రుగెత్తుతున్న స్టిల్ ఆక‌ట్టుకుంటోంది.

మార్చి మూడ‌వ వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి కీర‌వాణి మ‌రో కుమారుడు కాల‌బైర‌వ సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ చిత్రంలోని ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ స‌త్య గిడుగు, సినిమాటోగ్ర‌ఫీ సుంద‌ర్ రామ్‌, ఆర్ట్ పురుషోత్త‌మ్‌.