మ‌రో సారి చిక్కుల్లో చోటా కె. నాయుడు సోద‌రుడు?

మ‌రో సారి చిక్కుల్లో చోటా కె. నాయుడు సోద‌రుడు?
మ‌రో సారి చిక్కుల్లో చోటా కె. నాయుడు సోద‌రుడు?

ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కె. నాయుడు సోద‌రుడు శ్యామ్ కె. నాయుడు త‌న‌ని పెళ్లి చేసుకుంటాన‌ని మోసం చేశాడంటూ లాక్‌డౌన్ కి ముందు న‌టి శ్రీ‌సుధ ఎన్ ఆర్ న‌గ‌ర్ పోలీసుల్ని ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత త‌న సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేసి తాను కేసుని విత్‌డ్రా చేసుకున్న‌ట్టు శ్యామ్ కె. నాయుడు నాట‌కం ఆడాడ‌ని మ‌రోసారి పోలీసుల్ని ఆశ్ర‌యించ‌డం అప్ప‌ట్లో తీవ్ర క‌ల‌క‌ల‌కం సృష్టించింది.

తాజాగా న‌టి శ్రీ‌సుధ మ‌రోసారి సినిమాటోగ్రాఫ‌ర్‌ శ్యామ్ కె. నాయుడు పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. విజ‌య‌వాడ‌లోని క‌న‌క‌దుర్గ ఫ్లై ఓవ‌ర్‌పై జ‌రిగిన కారు ప్ర‌మాదంపై ప‌లు అనుమానాల్ని వ్య‌క్తం చేసిన ఆమె పోలీసుల్ని ఆశ్ర‌యించింది. అది ప్ర‌మాదం కాద‌ని, కొంత మంది దుండ‌గులు త‌న‌ని హ‌త్య చేయాల‌నే యాక్సిడెంట్‌కు ప్ర‌య‌త్నించార‌ని వెల్ల‌డించింది.

ఈ విష‌యంలో శ్యామ్ కె. నాయుడు ప్ర‌మేయం వున్న‌ట్టు త‌న‌కు అనుమానాలున్నాయ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో కేసు మ‌రో మ‌లుపు తిరిగిన‌ట్టు చెబుతున్నారు. గ‌త ఐదేళ్లుగా శ్యామ్ కె. నాయుడు త‌న‌తో స‌హ‌జీవ‌నం చేశాడ‌ని, పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించాడ‌ని ఆ త‌రువాత త‌న‌ని మోసం చేసి పెళ్లి చేసుకోన‌ని ఇప్పుడు అంటున్న‌ట్టు శ్యామ్ కె. నాయుడు పై గ‌తంలో శ్రీ‌సుధ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.