శ్రీదేవి ని ప్లాన్ ప్రకారమే చంపేసారా


sridevi death looks more planned murder says ax acp

అతిలోక సుందరి శ్రీదేవి ని పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసారని అయితే అది సహజ మరణం అనిపించేలా చేసారని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు మాజీ అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ వేద్ భూషణ్ . శ్రీదేవి ఫిబ్రవరి 24న దుబాయ్ లోని జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్ లో ప్రమాదవశాత్తు చనిపోయిన విషయం తెలిసిందే . ఆల్కహాల్ సేవించిన శ్రీదేవి మద్యం మత్తులో స్నానం చేయడానికి వెళ్లి బాత్ టబ్ లో పడి చనిపోగా ఆమె మరణం పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ దుబాయ్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేసారు . శ్రీదేవి భర్త బోనీ కపూర్ పై అనుమానాలు కూడా వ్యక్తం చేసారు కూడా కట్ చేస్తే అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి కొంతమంది జోక్యం తో .

అయితే శ్రీదేవిని హత్య చేసారని ఈ మాజీ ఎసిపి ఎందుకు ఆరోపిస్తున్నాడో తెలుసా ….. ….. శ్రీదేవి పైన 240 కోట్ల ఇన్సూరెన్స్ ఉందట పైగా ఆ ఇన్సూరెన్స్ డబ్బులు రావాలంటే శ్రీదేవి దుబాయ్ లో మరణిస్తేనే ఇస్తారని దుబాయ్ కాకుండా ఇతర దేశాల్లో చనిపోతే ఇవ్వరని అందుకే పక్కా ప్లాన్ ప్రకారం శ్రీదేవి ని హత్య చేసి ప్రమాదం గా చూపిస్తున్నారని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు . అంతేకాదు దుబాయ్ లో శ్రీదేవి బస చేసిన హోటల్ కు కూడా వెళ్ళాడట పరిశోధన నిమిత్తం కానీ ఆమె బస చేసిన హోటల్ లోకి అక్కడి సిబ్బంది అనుమతి ఇవ్వలేదని అంటున్నాడు వేద్ భూషణ్ .