శ్రీహరి కొడుకు మేఘాంశ్ రాజ్ దూత్ రెడీ


sriharis-son-meghanshs-rajdooth-movie-first-look-out

విలక్షణ నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ” రాజ్ దూత్ ” . అర్జున్ – కార్తీక్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్ ని రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసారు ఆ చిత్ర బృందం . మేఘాంశ్ బాల నటుడిగా భైరవ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే . తండ్రి తో కలిసి నటించిన మేఘాంశ్శ్రీహరి కు హీరోగా నిలబడాలని సత్తా చాటాలని ……. తండ్రి పేరు నిలబెట్టాలని ఉంది .

అందుకే తండ్రి మరణం తర్వాత కుంగిపోకుండా తల్లి యోగక్షేమాలు చూస్తూ నటనలో అలాగే డ్యాన్స్ లో శిక్షణ తీసుకున్నాడు . ఇక యూత్ ని టార్గెట్ చేస్తూ రాజ్ దూత్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు . త్వరలోనే టీజర్ , ట్రైలర్ ని రిలీజ్ చేసి జూలై లో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు రాజ్ దూత్ చిత్ర దర్శక నిర్మాతలు .