జగపతి బాబుకి ఇచ్చినట్లే శ్రీకాంత్ కి ఇవ్వగలడా?

జగపతి బాబుకి ఇచ్చినట్లే శ్రీకాంత్ కి ఇవ్వగలడా?
జగపతి బాబుకి ఇచ్చినట్లే శ్రీకాంత్ కి ఇవ్వగలడా?

బోయపాటి శ్రీను సినిమాలు ఒక టెంప్లేట్ ప్రకారం సాగిపోతుంటాయి. ఆయన సినిమాల్లో హీరోయిజం ఓ రేంజ్ లో ఎలివేట్ అవుతుంటుంది. హీరో పాత్రలు మాసీగా ఉంటాయి. హీరో పాత్రకు తగ్గట్లుగానే విలన్ పాత్రలూ అంతే పవర్ఫుల్ గా ఉంటాయి. విలన్ లకు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసి సక్సెస్ సాధించాడు బోయపాటి.

లెజండ్ తో జగపతి బాబు కెరీర్ టర్న్ అయిపోయింది. ఇప్పటికీ క్యారెక్టర్, విలన్ పాత్రలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు జగపతి బాబు. అలాగే సరైనోడు చిత్రంలో ఆదితో విలన్ వేషాలు వేయించి మంచి బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడిక శ్రీకాంత్ వంతు వచ్చింది. హీరోగా శ్రీకాంత్ కెరీర్ దాదాపు ముగిసినట్లే. అతనికి ఇప్పుడు మార్కెట్ లేదు. విలన్ గా అప్పుడు ఒకసారి ట్రై చేసాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు.

కానీ ఈసారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతోన్న అఖండ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. మరి జగపతి బాబు కెరీర్ టర్న్ అయినట్లే శ్రీకాంత్ కెరీర్ కూడా టర్న్ అవ్వగలదా?