ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు


srikanth controversy dailogue on ntr in operation 2019గాంధీ కడుపున గాంధీ పుట్టడు , ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు …… మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు అంటూ సంచలనం సృష్టించే డైలాగ్ ని వదిలాడు హీరో శ్రీకాంత్ . ఇప్పుడు ఈ డైలాగ్ డైనమైట్ లా పేలుతోంది . శ్రీకాంత్ హీరోగా నటించిన ” ఆపరేషన్ 2019” చిత్రం షూటింగ్ కార్యక్రమాలన్నీ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది దాంతో ఆ చిత్ర ట్రైలర్ ని తాజాగా విడుదల చేసారు . ఇప్పుడా ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది .

ఆపరేషన్ దుర్యోధన సంచలన విజయం సాధించిన నేపథ్యంలో రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది . ఆపరేషన్ 2019 అనే టైటిల్ పెట్టారంటేనే రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా అని స్పష్టం అవుతోంది , పైగా 2019 లో శాసన సభ తో పాటుగా పార్లమెంట్ కు కూడా ఎన్నికలు రాబోతున్నాయి . అయితే ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు అనే డైలాగ్ వివాదాస్పదం అయ్యేలా ఉంది . ఎందుకంటే ఎన్టీఆర్ హీరోగా , రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించాడు కానీ అతడి వారసుడిగా బాలయ్య ఆ స్థాయి ని ఇంకా అందుకోలేదు దాంతో ఈ డైలాగ్ వివాదాస్పదం అయ్యేలా ఉంది .