బాలయ్య తో సై అంటున్న శ్రీకాంత్


బాలయ్య తో సై అంటున్న శ్రీకాంత్
బాలయ్య తో సై అంటున్న శ్రీకాంత్

మా ఇంట్లో కారం లేకపోతే తినం. ఒంట్లో అహంకారం లేకపోతే బతకం..! చంపేస్తా.. లేదంటే చస్తా..! అంటూ లెజెండ్ సినిమాలో బాలకృష్ణ తో పోటాపోటీగా జగపతిబాబు నటన ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు మళ్ళీ బాలయ్య బాబుతో సై అనడానికి శ్రీకాంత్ రెడీ అవుతున్నారా.? ఇండస్ట్రీ లో ఇదే విషయం పై చర్చ నడుస్తోంది. విలన్స్ ని తనదైన స్టైల్ లో భీభత్సంగా చూపించే బోయపాటి శ్రీను గారు శ్రీకాంత్ ని ఎలా చూపిస్తారో.? అని అభిమానులు అంచనాలలో వున్నారు.

బాలకృష్ణ గారు ఫిబ్రవరి రెండోవారం నుండి షూట్ లో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఒక కొత్త ఆహార్యంతో కనపడిన బాలయ్య అందరినీ ఆకర్షించారు. ఇక రాజకీయాలకు అతీతంగా అందరూ ఆయనతో సేల్ఫీలు దిగారు. సినిమాలకు, రాజకీయాలకు సంబంధం లేకుండా బాలయ్య క్రేజ్ అలాగే ఉంది. ఇక వినయ విదేయ రామ సినిమా డిజాస్టర్ తరువాత బోయపాటి శ్రీను ఇప్పటికే స్క్రిప్ట్, తదితర అంశాల పై రీవర్క్ చేసుకుని మరింత పకడ్బందీగా ఈ సినిమాను ప్లాన్ చేసుకున్నారు.

బాలకృష్ణ సరసన హీరోయిన్స్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. గతంలో బోయపాటి శ్రీను గారితో జయజనకి నాయక సినిమా చేసిన మిర్యాల రవీంద్ర రెడ్డి గారు ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా చేస్తున్నారు . మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్, చిరంతన్ భట్ లలో ఎవరో ఒకరు కన్ ఫార్మ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ సినిమా లేట్ సమ్మర్ లో గానీ, దసరా ముందు కానీ రిలీజ్ చెయ్యడానికి యూనిట్ ప్లాన్ చేస్తోంది.