`పెళ్లిసంద‌డి` సీక్వెల్‌లో శ్రీ‌కాంత్ కొడుకు!


`పెళ్లిసంద‌డి` సీక్వెల్‌లో శ్రీ‌కాంత్ కొడుకు!
`పెళ్లిసంద‌డి` సీక్వెల్‌లో శ్రీ‌కాంత్ కొడుకు!

`శ్రీ‌కాంత్ హీరోగా న‌టించిన మ్యూజిక‌ల్ ల‌వ్‌స్టోరీ `పెళ్లిసంద‌డి`. 1996లో వ‌చ్చిన ఈ చిత్రం చిన్న సినిమాగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూస‌ర్స్ సి. అశ్వ‌నీద‌త్‌, అల్లు అర‌వింద్ సంయుక్తంగా తొలిసారి క‌లిసి నిర్మించిన చిత్ర‌మిది. కీర‌వాణి స్వ‌రాల‌తో ఈ మూవీని బ్లాక్ బ‌స్ట‌ర్‌గా మార్చేశారు.

హీరోగా శ్రీ‌కాంత్ కెరీర్‌ని మ‌లుపు తిప్పిన చిత్ర‌మిది. దీప్తి భ‌ట్నాగ‌ర్‌, ర‌వళి హీరోయిన్‌లుగా న‌టించారు. తెలుగులో మ్యూజిక‌ల్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని ఆ త‌రువాత త‌మిళ‌, హిందీ భాష‌‌ల్లో రీమేక్ చేశారు. అక్క‌డ కూడా అనూహ్య విజ‌యాన్ని సాధించింది. దాదాపు 25 ఏళ్ల త‌రువాత `పెళ్ల‌సంద‌D` పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్‌ చేయ‌బోతున్నారు.

ఈ సీక్వెల్ చిత్రంలో హీరో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌‌న్ హీరోగా న‌టించ‌బోతున్నాడు. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం ప‌ర్య‌వేక్ష‌ణలో తెర‌పైకి రానున్న ఈ మూవీకి గౌరీ రోన‌న్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతోంది. `బాహుబ‌లి` మేక‌ర్స్ ఆర్కా మీడియాతో క‌లిసి రాఘ‌వేంద్రార‌వు సోద‌రుడు కె. కృష్ణ‌మోహ‌న్‌రావు నిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్నిప్రారంభించ‌బోతున్నారు. కీర‌వాణి సంగీతం అందించ‌నున్న ఈ మూవీకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని వెల్ల‌డించ‌బోతున్నారు.