ఊహించిందే.. ఎఫైర్లు లేవంటోంది!

Srimukhi explains she is single
Srimukhi explains she is single

గత కొన్ని రోజులుగా ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ శ్రీముఖి గురించి రకరకాల కథనాలు షికార్లు చేసిన విషయం తెల్సిందే. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ కు చెందిన ఒక ఐటి వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఆ రిలేషన్ ను పెళ్లి వరకూ తీసుకెళ్లాలని శ్రీముఖి భావిస్తున్నట్లు కూడా రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయంపై శ్రీముఖి స్పందించింది. అందరూ ఊహించినట్లుగానే ఆ వార్తల్లో నిజం లేదంది. జర్నలిస్టులు తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్ధం చేసుకున్నారంది. తాను ఒకప్పుడు రిలేషన్ లో ఉన్న విషయాన్ని తెలిపితే ఇప్పుడు రిలేషన్ లో ఉన్న విషయాన్ని రాసారని వాపోయింది. పాస్ట్ టెన్స్ కు ప్రెజంట్ టెన్స్ కు మధ్య తేడాను గుర్తించలేకపోయారంది. ఇన్ని మాటలతో పాటు తాను ప్రస్తుతం సింగిల్ అని, ఏదైనా ఉంటే ఫస్ట్ తానే చెబుతానని, చాలా గర్వంగా ఇతనే నా బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తానని అంటోంది.

నిజానికి శ్రీముఖి గతంలో రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని బిగ్ బాస్ లో ఉన్నప్పుడే ఆమె అంగీకరించింది. తను ఉన్న ఫీల్డ్ లోని వ్యక్తితోనే తాను రిలేషన్ లో ఉన్నానని, అయితే అనుకోని కారణాల వల్ల ఇద్దరం విడిపోవాల్సి వచ్చిందని, అది ఒక బ్యాడ్ బ్రేకప్ అని చెప్పుకొచ్చింది శ్రీముఖి. దాన్నుండి బయటపడడానికి చాలా కష్టపడ్డానని, చనిపోవాలని కూడా అనుకున్నట్లు తెలిపింది. అప్పట్లో ఆ వ్యక్తి ప్రదీప్ మాచిరాజు లేదా రవి అని అందరూ అనుకున్నారు. ఆ విషయం ఏదో తేలకుండానే న్యూస్ సైడైపోయింది.

ఇప్పుడు లేటెస్ట్ గా ఈ న్యూస్ అన్నమాట. మరి శ్రీముఖి నిజంగానే సింగిల్ గా ఉందా లేక అందరూ సాధారణంగా చెప్పే మాటలనే శ్రీముఖి చెప్పిందా అన్నది చూడాలి. ప్రస్తుతం స్టార్ మా లో స్టార్ యాంకర్ గా తిరుగులేకుండా కొనసాగుతోన్న శ్రీముఖి ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్ లలో ప్రధమ స్థానంలో ఉంటుంది.