శ్రీముఖి కన్నింగ్ గేమ్ ఆడుతోందా?


Srimukhi mind games with contestants
Srimukhi mind games with contestants

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ప్రస్తుతం ఎనిమిదో వారంలో ఉంది. ఇప్పటికే ఇంటి నుండి హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అషు, అలీ,శిల్పా ఎలిమినేట్ అవ్వగా ఈ వారం ఎలిమినేషన్ కోసం మహేష్, రాహుల్, హిమజ నామినేషన్స్ లో ఉన్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నవారిలో శ్రీముఖి తన గేమ్ ను చాలా స్ట్రాటిజికల్ గా ఆడుతోంది. మొదట రాహుల్ ను టార్గెట్ చేస్తూ వచ్చింది శ్రీముఖి. తనని రాహుల్ ఏదో అన్నాడని అందుకే హౌజ్ లో ఉన్నన్నాళ్ళు తననే నామినేట్ చేస్తానని ఓ సందర్భంలో చెప్పింది.

అయితే రెండు వారాల క్రితం అలీ, రాహుల్ నామినేషన్స్ లో ఉండగా.. స్ట్రాంగ్ అనుకున్న అలీ ఇంటి నుండి ఎలిమినేట్ అయిపోయాడు. రాహుల్ కు అత్యధిక ఓట్లు వచ్చాయి. ఇది గ్రహించిన శ్రీముఖి వెంటనే తన గేమ్ ప్లాన్ మార్చేసింది. రాహుల్ తో ఫ్రెండ్షిప్ ను మళ్ళీ మొదలుపెట్టింది. మరోవైపు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన బాబా భాస్కర్, శివ జ్యోతి మధ్య చిచ్చు పెట్టాలని చూసింది.

బాబా భాస్కర్ తో శివజ్యోతి అందరితో రిలేషన్స్ పెట్టుకుని సఫర్ అవుతోందని చెప్పింది. బాబా భాస్కర్ ఇదే విషయాన్ని నిన్న బిగ్ బాస్ కాలేజీ టాస్క్ లో అడగగా శివ జ్యోతి పాతాళగంగ పారించింది. బాబా భాస్కర్, శివజ్యోతి మాట్లాడుకుని ఇష్యూని సాల్వ్ చేసుకున్నా తన పేరు బయటకి రాకుండా కంటెస్టెంట్స్ తో మైండ్ గేమ్స్ ఆడుతున్న శ్రీముఖి కచ్చితంగా ఫైనల్ కు వెళ్లేలా కనిపిస్తోంది.